: తెలంగాణ స్పీకర్ చాంబర్ లో బైఠాయించిన టీటీడీపీ నేతలు... తలసానిపై చర్యకు డిమాండ్
తెలంగాణ శాసనసభ నుంచి సస్పెండైన టీటీడీపీ నేతలకు సమావేశాలకు వెళ్లే అవకాశం లేదు. మరేం చేయాలి? స్పీకర్ చాంబరునే వేదికగా చేసుకుని నిరసనకు దిగారు. తమ పార్టీ టికెట్ పై గెలిచిన వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం వారంతా స్పీకర్ మధుసూదనాచారి చాంబర్ లో బైఠాయించారు. అసెంబ్లీలో జరగాల్సిన నిరసనల పర్వం తన చాంబర్ దాకా రావడంతో స్పీకర్ కాస్త అసహనానికి గురయ్యారు. స్పీకర్ చాంబర్ లో నిరసన సరికాదన్న మధుసూదనాచారి సూచనను వారు పట్టించుకోకుండా నిరసన కొనసాగిస్తున్నారు.