: డ్రోన్లు ఇలా కూడా ఉపయోగిస్తున్నారు!


మారుమూల ప్రాంతాల్లో దాగిన టెర్రరిస్టు మూకలపై దాడుల కోసం అమెరికా ప్రవేశపెట్టిన డ్రోన్లు (మానవ రహిత విమానాలు) ఎన్నో విధాలా ఉపయోగపడుతున్నాయి. ఆన్ లైన్ పోర్టళ్లు, పిజ్జా తయారీ సంస్థలు తమ డెలివరీకి కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నాయి. ఇప్పుడీ డ్రోన్లు అసాంఘిక శక్తులకు కూడా ఉపయోగపడుతున్నాయి. తాజాగా, బ్రిటన్ లోని బెడ్ ఫోర్డ్ జైలు రక్షణ కంచెలో ఓ డ్రోన్ చిక్కుకుని ఉండడాన్ని అక్కడ భద్రతా సిబ్బంది గుర్తించారు. దానిని బయటికి తీసి పరిక్షించగా, అందులో మాదకద్రవ్యాలు, మొబైళ్లు, కత్తి, స్క్రూ డ్రైవర్ దర్శనమిచ్చాయి. ఈ డ్రోన్ ను డీజేఐ ఫాంటమ్-2 మోడల్ గా గుర్తించారు. దానికి ఓ సంచీ అమర్చి దాంట్లో సరంజామా ఉంచారు. ఘటన ఈ నెల మొదటివారంలో జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

  • Loading...

More Telugu News