: పోలీసులపై ముక్కామల స్వామి కుమార్తె హర్షిత వీరంగం
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఓ యువతి పోలీసులపై వీరంగం వేసింది. ముక్కామల స్వామి కుమార్తె హర్షిత వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నా కారు (ఏపీ10 ఏవై 5555)నే ఆపుతారా? అంటూ చిందులేసింది. 'ఇప్పుడే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాను, మాట్లాడండి' అంటూ పోలీసులతో దురుసుగా వ్యవహరించింది. దీంతో, ఆమెపై తణుకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా, రోడ్డుపై హర్షిత హల్ చల్ కారణంగా అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.