: పోలీసుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోయిన దొంగలు
వరంగల్ జిల్లాలో దోపిడీదొంగలు రెచ్చిపోయారు. సాధారణ పౌరుల నివాసాల్లో వారు దోపిడీకి తెగించారనుకునేరు! సాక్షాత్తూ పోలీసుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్నారు. జిల్లాలోని మామునూరు పోలీస్ క్యాంప్ క్వార్టర్స్ లో చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 7 ఇళ్లలో దొంగలు భారీ ఎత్తున నగలు, నగదు దోచుకున్నారు. ప్రస్తుతం దొంగల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, పోలీసోళ్ల ఇళ్లకే రక్షణ లేకపోతే, ఇక సామాన్యులకు ఏం రక్షణ ఉంటుందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.