: ఆమ్లా వికెట్ డౌన్... దక్షిణాఫ్రికా 26/1
న్యూజిలాండ్ తో సెమీస్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా వికెట్ చేజార్చుకుంది. ఆమ్లా 10 పరుగులు చేసి బౌల్ట్ బంతికి బౌల్డయ్యాడు. బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని బెయిల్స్ ను గిరాటేసింది. ప్రస్తుతం సఫారీలు 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 26 పరుగులు చేశారు. క్రీజులో ఓపెనర్ డి కాక్ (12 బ్యాటింగ్) కు తోడుగా డు ప్లెసిస్ (4 బ్యాటింగ్) ఉన్నాడు. ఆక్లాండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ నెగ్గింది.