: అందుకే కొత్త రాజధాని పేరు 'అమరావతి'!


ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుపై ఉత్కంఠ తొలగిపోయినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు? రాజధానికి ఏ పేరు పెడతారు? వంటి విషయాలపై పలు వాదనలు వినిపించాయి. రాజధానిగా తుళ్లూరు ప్రాంతాన్ని నిర్ణయించడంతో కొత్త రాజధానికి ఏ పేరు పెడతారు? అంటూ మరో వాదన ఊపందుకుంది. అయితే రాజధాని ప్రాంతాన్ని ఎంత స్పష్టంగా ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసుకుందో, అంతే స్పష్టంగా ప్రణాళికా బద్ధంగా రాజధానికి 'అమరావతి' అని పేరును నిర్ణయించిందని తెలుస్తోంది. దీంతో రాజధాని పేరుపై సస్పెన్స్ తొలగిపోయినట్టు సమాచారం. చారిత్రక ప్రాధాన్యత, స్థల పురాణం, ప్రాచీన వైభవం దృష్ట్యా ఏపీ రాజధానికి 'అమరావతి' పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరానికి కుడివైపున 'అమరావతి' ఉంది. దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దీనిని ధాన్యకటకం అని కూడా పిలుచుకునేవారు. ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాల్లో ఒకటైన అమరేశ్వరాలయం పేరుమీదుగా 'అమరావతి' పేరు వచ్చింది. శాతవాహనుల్లో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి 'అమరావతి'ని పరిపాలించారు. కాగా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి'కి తూర్పున తుళ్లూరు మండలం, ఉత్తరాన కంచికచర్ల మండలం, దక్షిణాన ఇబ్రహీంపట్నం మండలం, పశ్చిమాన పెదకూరపాడు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News