: భూమిపూజ రోజునే కొత్త రాజధానికి పేరు: ప్రత్తిపాటి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి జరిపే భూమిపూజ రోజునే నామకరణం జరిపే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధానికి 'అమరావతి' పేరును చాలా మంది సూచించారని అన్నారు. గుంటూరు జిల్లాలోని కొండవీటి కోటను చారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. అలాగే కొండవీటి కోటకు 42 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నామని ఆయన తెలిపారు. కాగా, మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును 'అమరావతి'గా ఖరారు చేసినట్టు స్పష్టమవుతోంది. అయితే, అధికారికంగా ఇంకా ప్రకటించకపోవడంతో పేరుపై సస్పెన్స్ నెలకొంది.

  • Loading...

More Telugu News