: చదవని వాళ్లు ఆన్సర్లు వెతుకుతూనే ఉంటారు: లాలూ


బీహార్లో ఇటీవల జరిగిన మాస్ కాపీయింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఇలాంటి అనైతిక చర్యలకు విరుగుడుగా, ప్రభుత్వం ఓపెన్ బుక్ పరీక్షా విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. బాగా చదివిన వాళ్లకే ఆ పుస్తకాల్లో జవాబులు ఎక్కడుంటాయో తెలుస్తుందని, వారే రాయగలరని అన్నారు. ఇక, చదవనివాళ్లు పరీక్షా సమయం దాటిపోయినా ఆన్సర్లు వెతుకుతూనే ఉంటారని తెలిపారు. బక్షర్ జిల్లాలో ఓ పాఠశాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ బుక్ పరీక్షా విధానానికి బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ కూడా మద్దతు పలికారు. అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీల పరిధిలోనూ, ప్రపంచంలోని కొన్ని చోట్ల ఈ పద్ధతి అమల్లో ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News