: మోదీకి మరో గుడి కడుతున్నారు!
ప్రధాని నరేంద్ర మోదీపై కొందరిలో అభిమానం పొంగిపొర్లుతోంది. ఇటీవలే 'నమో టెంపుల్' పేరిట ఆయనకు గుడికట్టడం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాలో ఓ వీహెచ్ పీ నేత మోదీ పేరిట ఆలయం నిర్మించారు. ఇప్పుడు అలాంటిదే మరో గుడి కడుతున్నారు. ఇది కూడా ఉత్తరప్రదేశ్ లోనే. అలహాబాద్ జిల్లా జలాల్ పూర్ లో నిర్మితమవుతున్న ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడు, మోదీ విగ్రహాలు మాత్రమే ఉంటాయి. శ్రీకృష్ణసేన అధ్యక్షుడు పుష్పరాజ్ సింగ్ ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. కోటిన్నర రూపాయల వ్యయంతో భారీ స్థాయిలో నిర్మిస్తామని, హిందుత్వ సంస్థల నుంచే విరాళాలు సేకరిస్తామని పుష్పరాజ్ తెలిపారు. కాగా, తన పేరిట ఆలయాలపై మోదీ చిరాకు పడుతున్న సంగతి తెలిసిందే.