: చంద్రబాబుకు ఎమ్మెల్యేల శుభాకాంక్షలు... స్వీట్స్ పంచిన సీఎం
తనకు మనవడు పుట్టిన సంతోషాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో పార్టీ ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. ఆయన అసెంబ్లీకి రాగానే టీడీపీ ఎమ్మెల్యేలు బాబు వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత తన ఛాంబర్ లో వారందరికీ చంద్రబాబు స్పీట్స్ ఇచ్చారు. కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణీలకు ఉగాదినాడు కుమారుడు పుట్టిన సంగతి తెలిసిందే.