: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారుల పక్కన అనుమతిలేని ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్ లు ఎందుకు తొలగించలేదంటూ మండిపడింది. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది. మీకు (ప్రభుత్వాలు) సాధ్యంకాకపోతే తామే చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఎల్లుండిలోగా వాటికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఇరు ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది. నివేదిక ఇవ్వకుంటే జిల్లా జడ్జిలతో కమిటీలు ఏర్పాటుచేసి తామే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.