: పార్టీ వీడాక సస్పెన్షన్ వేటు... నేదురుమల్లి రామ్ కుమార్ పై రఘువీరా చర్య!


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నిన్న సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామన్నదే సదరు ప్రకటన సారాంశం. అయితే అప్పటికే రామ్ కుమార్ పార్టీని వీడారు. బీజేపీలో చేరిపోయారు. నెల్లూరులో నిన్న జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే గడచిన ఎన్నికల్లో ఒనగూరిన పరాజయం నుంచి తేరుకోని రఘువీరా కాస్త ఆలస్యంగా మేల్కొని, రామ్ కుమార్ బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

  • Loading...

More Telugu News