: సునామీ తాకకుండా రూ. 40 వేల కోట్లతో జపాన్ భారీ గోడ


సముద్రానికి అడ్డంగా సుమారు ఐదు అంతస్తుల ఎత్తుండే భారీ సిమెంట్ గోడను నిర్మించడం ద్వారా సునామీ ప్రమాదాన్ని ఎదుర్కోవాలని జపాన్ యోచిస్తోంది. దీనికోసం రూ. 40,800 కోట్ల వ్యయంతో భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సుమారు 12.5 మీటర్ల ఎత్తులో బలంగా ఉండే ఈ గోడ సునామీ అలలను నిరోధిస్తుందని, ఉత్తర ఒసాబేలోని కజుతోషి ముసాషీ పోర్ట్ సమీపంలో నిర్మిస్తామని జపాన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. కాగా, సిమెంట్ గోడ వల్ల ప్రజలకు ప్రయోజనం తక్కువేనని, సముద్ర తీర పర్యావరణం, ప్రకృతి అందాలకు నష్టం వాటిల్లుతుందని, మత్స్యకారుల జీవనాధారానికి అడ్డంకులు ఏర్పడతాయని ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. గోడ నిర్మాణం చేపడితే తమకు భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ ప్రాంతంలోని యువత ఆనందిస్తోంది.

  • Loading...

More Telugu News