: సింగపూర్ మాజీ ప్రధానికి సంతాపం తెలిపిన ఏపీ అసెంబ్లీ


సింగపూర్ ను ఊహించని రీతిలో అభివృద్ధి చేసి, ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థిక కేంద్రాల్లో ఒకటిగా నిలిపిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి లీ కున్ యూకు ఏపీ అసెంబ్లీ నివాళి అర్పించింది. ఆయన గౌరవార్థం అసెంబ్లీలోని సభ్యులంతా నిలబడి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన గురించి స్పీకర్ మాట్లాడుతూ, సింగపూర్ ను అత్యద్భుతంగా మలచిన లీ నాయకత్వం అత్యంత గొప్పదని తెలిపారు. ఆయన వక్తిత్వం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News