: తనపై పెట్టిన కేసుపై శిల్పాశెట్టి స్పందన
డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించలేదంటూ ఎంకె మీడియా ఫిర్యాదు చేయడం, కోల్ కతా పోలీసులు కేసు నమోదు చేయడంపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ట్విట్టర్ లో స్పందించింది. "క్రేజీ న్యూస్! మనోజ్ జైన్ (ఎంకే మీడియా బోర్డ్ డైరెక్టర్) చేస్తున్న హాస్యాస్పద వ్యాఖ్యలపై నేను ఛాలెంజ్ చేస్తున్నా. తను (జైన్) చేసిన వ్యాఖ్యలు నేను కష్టపడి సంపాదించుకున్న పాప్యులారిటీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నట్లుగా వున్నాయి. కేసుకు సంబంధించి న్యాయసలహా కోరుతున్నాం. అతనో డిఫాల్టర్, మోసగాడని క్లియర్ గా తెలుస్తోంది. ఇలాంటివాటి పట్ల చాలా అసహ్యంగా ఉంది" అని శిల్పా ట్వీట్ చేసింది. అటు ఆమె భర్త, ఎఫ్ఐఆర్ లో పేరున్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా స్పందిస్తూ, ఎంకే మీడియా పై మండిపడ్డాడు.