: లోటస్ పాండ్ నుంచి అసెంబ్లీకి వైకాపా పాదయాత్ర


అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ, వైకాపా పాదయాత్రను చేపట్టింది. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా ఈ పాదయాత్రకు కదలివచ్చారు. పాదయాత్రలో భాగంగా తొలుత లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం, విగ్రహం వద్ద స్పీకర్ వ్యవహారశైలిపై తమ నిరసనను తెలియజేశారు. ఆ తర్వాత, అక్కడి నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా బయలుదేరారు. స్పీకర్, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్లకార్డులు చేతబట్టి, పెద్దపెట్టున నినాదాలు చేస్తూ, వీరి పాదయాత్ర కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News