: చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుంది సింగపూర్ ప్రభుత్వంతో కాదు: కేవీపీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణంపై ఎవరి సలహాలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. చంద్రబాబుకు ఎమ్మెల్సీల సంఖ్య పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదా అంశంపై ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. విభజన హామీల విషయంలో పార్లమెంటులో సోనియా చేసిన ప్రకటనను కేంద్రంపై ఆయుధంగా వాడుకోవాలని సూచించారు. అంతేగానీ, స్వప్రయోజనాల కోసం సోనియాపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఏపీ ప్రయోజనాల కోసం వెంకయ్యనాయుడు, చంద్రబాబు, వామపక్షాలతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని కేవీపీ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.