: రూ.6 లక్షలు పలికిన సచిన్ చివరి టెస్టు జెర్సీ


భారత్ క్రికెట్ కు సంబంధించినంత వరకు సచిన్ టెండూల్కర్ ఓ మహోన్నతుడు. మైదానంలో తన ఆటతో, వెలుపల తన వ్యక్తిత్వంతో అందరి అభిమానానికి పాత్రుడయ్యాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికినా, సచిన్ పై అభిమానం వీసమెత్తయినా తగ్గలేదనడానికి ఇదే నిదర్శనం. కెరీర్లో చివరి టెస్టు సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ ధరించిన జెర్సీని తాజాగా వేలం వేయగా, రూ.6 లక్షలు పలికింది. జోథ్ పూర్ రాజవంశీకుడు శివ్ రాజ్ సింగ్ వేలంలో ఈ జెర్సీని దక్కించుకున్నారు. జోథ్ పూర్ లోని ఉమైద్ భవన్ లో ఈ వేలం ప్రక్రియ నిర్వహించారు. ఈ వేలంలో ఇతర ప్రముఖుల వస్తువులను కూడా ఉంచారు. ఈ వేలంలో వచ్చిన మొత్తాన్ని తల, మెదడు గాయాలతో బాధపడే వ్యక్తుల సహాయార్థం వినియోగించనున్నారు. కాగా, కెరీర్లో మొత్తం 200 టెస్టులాడిన సచిన్ చివరి టెస్టును 2013లో ముంబయిలో విండీస్ పై ఆడాడు.

  • Loading...

More Telugu News