: పక్కపక్కనే మంత్రులు అయ్యన్న, గంటా... రుద్రమదేవి ఆడియో రిలీజ్ లో అరుదైన దృశ్యం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేబినెట్ లో గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక సభ్యులు. విశాఖ జిల్లాకు చెందిన వీరిద్దరి మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే వారిద్దరూ పక్కపక్కనే కూర్చుని ఉగాది పర్వదినాన ఒక్క విశాఖ వాసులనే కాక, ఏపీ ప్రజలకు కనువిందు చేశారు. విశాఖలో జరుగుతున్న రుద్రమదేవి ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఈ అరుదైన ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఆడియో రిలీజ్ లో భాగంగా రాజకీయాల్లో సీనియర్ అయిన అయ్యన్న ఓ పాటను రిలీజ్ చేయగా, ఆ తర్వాత గంటా మరో పాటను విడుదల చేశారు.