: టీమిండియా జైత్రయాత్రతో ఆసీస్ బెంబేలు... సెమీస్ పెద్ద సవాలేనంటున్న క్లార్క్


వరల్డ్ కప్ లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియాను చూసి ఆసీస్ బెంబేలెత్తిపోతోంది. టీమిండియాతో జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్ తమకు పెద్ద సవాలేనని సాక్షాత్తు ఆ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. ఇరు దేశాల మధ్య సెమీ ఫైనల్ నేపథ్యంలో నేడు మీడియాతో మాట్లాడిన సందర్భంగా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ప్రతిభావంతులైన క్రికెటర్లతో నిండి ఉందన్న క్లార్క్, నెలల తరబడి తమ దేశంలో పర్యటిస్తున్న క్రమంలో తమ పిచ్ లకు వారంతా బాగా అలవాటుపడ్డారని అన్నాడు. ఈ కారణంగా టీమిండియాపై నెగ్గడం అంత తేలికైన విషయమేమీ కాదని క్లార్క్ ఒప్పుకున్నాడు.

  • Loading...

More Telugu News