: లోకేశ్-బ్రాహ్మణి దంపతులకు పుత్రోదయం... ఉగాది నాడు తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ
నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులకు పుత్రోదయం అయింది. బ్రాహ్మణి ఈ మధ్యాహ్నం పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. మాదాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం అయింది. దీంతో, ఏపీ సీఎం చంద్రబాబు, నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాతలయ్యారు. లోకేశ్, బ్రాహ్మణిలకు 2007లో వివాహం అయింది. కాగా, బ్రాహ్మణి గర్భవతి అన్నప్పటి నుంచి ఇరు కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఉగాది శుభసమయాన ఓ మగశిశువు జన్మనివ్వడంతో బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.