: సొంత డబ్బుతో... ‘లింగ’ వివాదానికి తెరదించేందుకు సిద్ధమైన రజనీ


తమిళ సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసిన ‘లింగ’ వివాదానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దాదాపు రెండు నెలలుగా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ మధ్య కొనసాగుతున్న ఈ వివాదానికి ‘సొంత డబ్బు’తో రజనీ ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. ఈ విషయాన్ని తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్. థాను ధ్రువీకరించారు. అయితే, ఈ వివాదం పరిష్కారం కోసం రజనీ ఎంతమేర సొమ్మును చెల్లిస్తారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు. రాక్ లైన్ వెంకటేశ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో సంచలన దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లింగ’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో, భారీ ధరకు చిత్రాన్ని కొనుగోలు చేసి రూ.35 కోట్ల మేర నష్టపోయామంటూ డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News