: ఉగాది సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు... పెరిగిపోయిన క్యూ లైన్లు
మన్మథ నామ ఉగాదిని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. దీంతో, నిన్న రాత్రి నుంచే మల్లన్న సన్నిధిలో కోలాహలం నెలకొంది. భారీగా తరలివచ్చిన భక్తులు, మల్లన్న దర్శనం కోసం బారులు తీరారు. దీంతో, క్యూ లైన్లు చాంతాడంత మేర పెరిగిపోయాయి. మల్లన్న దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ఇక, శ్రీశైలం చేరుకున్న భక్తుల పుణ్యస్నానాలతో పాతాళ గంగలోనూ రద్దీ నెలకొంది.