: రఘువీరా మౌనదీక్ష... ప్రజల బాగు కోసం 20 ఏళ్లుగా పీసీసీ చీఫ్ మొక్కవోని సంకల్పం


ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి మౌనదీక్షకు దిగారు. అదేంటీ, పండుగ రోజు కూడా నిరసన మంత్రమేమిటని నొసలు చిట్లిస్తున్నారా? అంత అవసరమేమీ లేదులెండి. ఎందుకంటే, రఘువీరా మౌనదీక్ష ప్రభుత్వాలపై నిరసన కోసం కాదట. ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుతూ ఆయన దీక్ష చేపట్టారు. ఈ ఏడాదే కాదు, గడచిన 20 ఏళ్లుగా ఆయన ఏటా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గంట పాటు మౌనదీక్ష చేస్తున్నారు. నేడు కూడా మన్మథనామ ఉగాదిని పురస్కరించుకుని ఆయన అనంతపురం జిల్లాలోని తన స్వస్థలం మడకశిరలో మౌనదీక్ష చేపట్టారు.

  • Loading...

More Telugu News