: రాస్ టేలర్ ఔట్ తో క్రీజులోకి వచ్చిన కోరీ ఆండర్సన్... డబుల్ సెంచరీ దిశగా గప్టిల్
విండీస్ తో జరుగుతున్న వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (168)కు మంచి సహకారం అందిస్తూ నిలకడగా ఆడుతున్న కివీస్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ (42) ను విండీస్ రనౌట్ చేసింది. దీంతో రాస్ టేలర్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కివీస్ సంచలనం కోరీ ఆండర్సన్ (15) బౌండరీలతో చెరలేగాడు. ఇక సెంచరీ పూర్తైన తర్వాత దూకుడు పెంచిన గప్టిల్, డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. 111 బంతుల్లోనే సెంచరీ సాధించిన అతడు, మరో 30 బంతుల్లోనే 68 పరుగులు రాబట్టాడు. గప్టిల్ వీరవిహారంతో కివీస్ 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.