: మట్టి మిద్దె కూలి తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి... పాలమూరు జిల్లాలో విషాదం
మహబూబ్ నగర్ జిల్లాలో గత రాత్రి విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలిన ఘటనలో ఓ తల్లితో పాటు ఆమె కూతురు, కొడుకు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని వీపనగండ్ల మండలం కొప్పునూరులో ఈ ఘటన గడచిన రాత్రి చోటుచేసుకుంది. ప్రమాదంలో సాయిలీల (32), ఆమె కొడుకు దినేశ్ (6), కూతురు దీపిక (4) అక్కడికక్కడే చనిపోయారు. తెల్లవారితే ఉగాది సంబరాలు జరగనున్న తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో కొప్పునూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.