: చంద్రబాబుకు ఇంగ్లీష్ వచ్చు... కానీ, మోదీకి అర్థమవుతుందని మాట్లాడరు: జగన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎప్పుడూ సీరియస్ గా విమర్శలు గుప్పించే వైసీపీ అధినేత జగన్... ఈ రోజు మాత్రం కాస్త కామెడీని మిళితం చేసి నవ్వులు పూయించారు. లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు ఇంగ్లీష్ వచ్చని... కానీ, విభజన హామీల గురించి ఏనాడు కూడా నేషనల్ మీడియాతో మాట్లాడరని అన్నారు. పొరపాటున ఇంగ్లీష్ లో మాట్లాడితే, ప్రధాని మోదీకి అర్థమవుతుందని, అప్పుడు ఈయనకు నష్టమని... అందుకే ఇంగ్లీష్ లో మాట్లాడటం మానేశారని వివరించారు. అదే తెలుగులో అయితే, విభజన హామీలు అమలు కాలేదనే విషయంపై మీడియాకు బోర్ కొట్టేంతవరకు మాట్లాడతారని అన్నారు. జగన్ వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు సరదాగా నవ్వుకున్నారు.