: పాక్ ఇంటికి... సెమీస్ లో భారత ప్రత్యర్థి ఆస్ట్రేలియా


మరో రెండడుగులు సరిగ్గా వేసి వరుసగా రెండోసారి ప్రపంచ కప్ విజేతలుగా నిలవాలని కలలు కంటున్న భారత జట్టు సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా రూపంలో పెనుప్రమాదాన్ని అధిగమించాల్సి ఉంది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో పాకిస్థాన్ నిర్దేశించిన 214 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 33.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి అధిగమించింది. ఫించ్ 2, క్లార్క్ 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయి నిరాశ పరిచినా, స్మిత్, వాట్సన్ అర్ధ సెంచరీలు సాధించి జట్టుకు విజయాన్ని అందించారు. స్మిత్ 65, వాట్సన్ 64*, మాక్స్ వెల్ 44* పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో రియాజ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. కాగా, ఈ విజయంతో 7 సార్లు వరల్డ్ కప్ పోటీల సెమీస్ లోకి అడుగుపెట్టిన ఏకైక జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News