: ఏపీ శాసనసభ బూతులమయం... 'A' సర్టిఫికేట్ ఇవ్వాలి: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యక్ష ప్రసారాలు చూడాలంటేనే ఇబ్బంది కలుగుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ్యులు నోటికి వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని, చివరకు బూతు పదాలు కూడా ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇళ్లలో కుటుంబసభ్యులతో కలసి సమావేశ ప్రసారాలను వీక్షించే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు. సినిమాలకు ఇచ్చే 'A' సర్టిఫికేట్ ను ఈ సమావేశాలకు కూడా ఇస్తే బాగుంటుందని సూచించారు. మహిళా సభ్యులు కూడా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుండటం బాధాకరమని రఘువీరా అభిప్రాయపడ్డారు.