: శాసనసభలో దొరకని దాన్ని మీడియా సమావేశంలో పొందిన జగన్
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తనకు సరిపడా సమయాన్ని ఇవ్వడం లేదని వైసీపీ అధినేత జగన్ పలుమార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సి ఉందని... అయినా మైక్ ఇవ్వడం లేదని ఆయన పలుమార్లు సభలోనే చెప్పారు. అయితే, శాసనసభలో దొరకని దాన్ని మీడియా సమావేశంలో ఆయన పొందారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైసీపీ, తీర్మానంపై చర్చకు పిలిచేంత వరకు అసెంబ్లీలో అడుగుపెట్టబోమని వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, లోటస్ పాండ్ లో ఈ ఉదయం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, తన కోరిక తీరేలా, మీడియా ముందు సుదీర్ఘ ప్రసంగం చేశారు జగన్. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆయన ప్రసంగం, దాదాపు రెండున్నర గంటలకు పైగా కొనసాగింది.