: ఏపీని పాలిస్తోంది చంద్రబాబు కాదు... లోకేష్ పాలన నడుస్తోంది: దేవినేని నెహ్రు
ఆంధ్రప్రదేశ్ లో అరాచకపాలన సాగుతోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రు ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీని పరిపాలిస్తున్నది చంద్రబాబు కాదని... ఆయన కుమారుడు లోకేష్ అని వ్యాఖ్యానించారు. దివంగత రాజశేఖర్ రెడ్డి అవినీతిపరుడు అంటూ చంద్రబాబు పదేపదే విమర్శిస్తున్నారని... ఆయన దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నాన్ని అధికారపక్షం చేస్తోందని ఆరోపించారు.