: సుప్రీంను ఆశ్రయించిన మన్మోహన్... సీబీఐ కోర్టు ఆదేశాలను నిలిపివేయాలని పిటిషన్


బొగ్గు కుంభకోణంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోల్ స్కాంలో సీబీఐ కోర్టు జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మన్మోహన్ తరఫున కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయ కోవిదుడు కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో పలువురు పారిశ్రామికవేత్తలకు నాటి యూపీఏ ప్రభుత్వం సహకరించిందని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి పడుతుందని తెలిసినా, ప్రదాని హోదాలో ఉండి కూడా మన్మోహన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News