: నేను చెప్పినట్లు వింటే... గంటలో సస్పెన్షన్ ఎత్తివేయిస్తా: టీ టీడీపీకి జానా బంపర్ ఆపర్


తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గురైన టీ టీడీపీకి సీఎల్పీ నేత కుందూరు జానా రెడ్డి బంపర్ ఆఫరిచ్చారు. సస్పెన్షన్ ఎత్తివేయించండి అంటూ తనను కలిసిన టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్ రెడ్డిలకు ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. సభలో అధికార పక్షాన్ని తిట్టకుండా ఉంటే, కేవలం గంటలో సస్పెన్షన్ ఎత్తివేయిస్తానన్న ఆయన ఆఫర్ ను అక్కడికక్కడే రేవంత్ రెడ్డి తిరస్కరించారు. అయినా ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరు సాగించకుండా ఎలా ఉంటామని తనను ప్రశ్నించిన రేవంత్ కు జానా ఘాటుగానే సమాధానమిచ్చారు. మేం కూడా ప్రతిపక్షమేగా, మేం ప్రభుత్వాన్ని తిట్టడం లేదు కదా? అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీయాలంటే దూషణలే మార్గం కాదు కదా అని కూడా ఆయన ఒకింత సున్నితంగానే రేవంత్ ను మందలించారట.

  • Loading...

More Telugu News