: సెమీస్ లో పాక్ ను ఓడిస్తే వచ్చే కిక్కే వేరప్పా... టీమిండియా అభిమానుల కోరిక


అడిలైడ్ లో పాకిస్థాన్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో విజేతగా ఆస్ట్రేలియా నిలుస్తుందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ కప్ సందర్భంగా సోషల్ మీడియాలో క్రికెట్ పోటీల్లో విజేతలు ఎవరు? అంటూ పలు సంస్థలు అభిప్రాయాలు సేకరించి, సర్వేల ఫలితాలు విడుదల చేస్తున్నాయి. ఈ సర్వేలో ఎక్కువ మంది టీమిండియా అభిమానులు పాకిస్థాన్ విజయం సాధిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సెమీస్ లో పాకిస్థాన్ మనకు ప్రత్యర్థిగా వస్తే, టీమిండియా మరోసారి పాక్ ను ఓడిస్తే ఆ మజాయే వేరని అభిమానులు పేర్కొంటున్నారు. ఆ మజా అనుభవించడానికైనా పాక్ విజయం సాధించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్ లో విజయం మాత్రం ఆస్ట్రేలియాదేనని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News