: ఏపీ, తెలంగాణ సీఎస్ లతో భేటీ కానున్న ఏకే సింగ్ బృందం
పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఏర్పడిన రెండు రాష్ట్రాల్లో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర బృందం నేడు హైదరాబాదు రానుంది. అనంతరం రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో ఏకే సింగ్ నేతృత్వంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారుల బృందం పలు సమస్యలపై చర్చించనుంది. విద్యుత్, నీటి వాటాలు సహా విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలపై కేంద్ర బృందం వారితో చర్చించనుంది. కాగా విభజన అనంతరం నెలకొన్న సమస్యలపై ఇరు రాష్ట్రాలు కేంద్రానికి పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్న విషయం తెలిసిందే.