: మనవాళ్లు ఆ 70 మందిని పెవిలియన్ బాట పట్టించింది ఎలాగో తెలుసా?


ప్రపంచకప్ లో వరుసగా ఏడు మ్యాచ్ లలో ప్రత్యర్థులను టీమిండియా ఆలౌట్ చేసింది. వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా ఏడు మ్యాచుల్లో 70 వికెట్లు తీసిన మొదటి జట్టుగా టీమిండియా రికార్డు పుటలకెక్కింది. భారత్ బౌలింగ్ తేలిపోతుందని ప్రత్యర్థులు, విశ్లేషకులు అంచనా వేసిన చోట భారత సీమర్లు, స్పిన్నర్లు చెలరేగి ప్రత్యర్థుల భరతం పట్టారు. టీమిండియా సాధించిన 70 వికెట్లలో 43 వికెట్లను పేసర్లు తమ ఖాతాలో వేసుకుంటే, స్పిన్నర్లు 22 మందిని పెవిలియన్ బాటపట్టించారు. మరో ఐదుగురు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. ఫీల్డ్ లో చిరుతల్లా కదిలిన భారత ఆటగాళ్లు 36 క్యాచ్ లు పడితే, ధోనీ 14 క్యాచ్ లు పట్టాడు. 8 మందిని బౌల్డ్ చేయగా, ముగ్గుర్ని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపారు. ఐదుగుర్ని రనౌట్ చేశారు. నలుగుర్ని కాట్ అండ్ బౌల్డ్ గా బౌలర్లు పెవిలియన్ బాటపట్టించారు. మహ్మద్ షమీ 17, ఉమేష్ యాదవ్ 14, రవి చంద్రన్ అశ్విన్ 12, మోహిత్ శర్మ 11 వికెట్లు పడగొట్టడం విశేషం.

  • Loading...

More Telugu News