: హైదరాబాదులో దారుణం... పంజాగుట్టలో యువతి సజీవ దహనం
హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం దారుణం వెలుగుచూసింది. నగరంలోని పంజాగుట్ట పరిధిలో ఓ యువతి సజీవ దహనమైంది. గుర్తు తెలియని దుండగులు 25 ఏళ్ల వయస్సున్న యువతిని సజీవ దహనం చేశారు. పంజాగుట్టలోని అగర్వాల్ కంటి ఆస్పత్రి వెనుక భాగంలో యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.