: ఎంసీజీలో నిన్నటి రెండు జాతీయ గీతాలు విశ్వకవి రవీంద్రుడు రాసినవేనట!
వరల్డ్ కప్ నాకౌట్ పోటీల్లో భాగంగా నిన్న మెల్ బోర్న్ లోని ఎంసీజీలో జరిగిన మ్యాచ్ పలు రికార్డులను నెలకొల్పింది. ప్రత్యేకించి భారత జట్టు, జట్టు కెప్టెన్ ధోనీకి అరుదైన రికార్డులను కట్టబెట్టింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ రికార్డులు నమోదు కాగా, మ్యాచ్ ప్రారంభం కాకముందే మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల జాతీయ గీతాలను ఆలపించడం ఆనవాయతీ. భారత్ జట్టు తరఫున ‘‘జనగణమన...’’ బంగ్లాదేశ్ జట్టు తరఫున ‘‘అమర్ సోనార్ బంగ్లా...’’ గీతాలు వినిపించాయి. ఈ రెండు గీతాలు రెండు దేశాలకు జాతీయ గీతాలుగా కొనసాగుతున్నా, ఒకే కవి కలం నుంచి జాలువారినవేనన్న విషయం నిన్న కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ ఈ రెండు గీతాలను రాశారు. 1911 లో రవీంద్రుడు జనగణమన రాయగా, అంతకంటే ముందే బెంగాల్ విభజన సందర్భంగా 1905లో అమర్ సోనాల్ బంగ్లా గీతాన్ని కూడా ఆయనే రాశారు.