: 'మా' నుంచి అందుకే తప్పుకుంటున్నా: మురళీమోహన్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు. సంఘం పేరు ప్రతిష్ఠలు దెబ్బతినకుండా, మెరుగైన సేవలందించే వ్యక్తులకు అవకాశం ఇవ్వాలనే తాను 'మా' అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రాజేంద్రప్రసాద్ తో తనకు విభేదాలేమీ లేవని అన్నారు. అయితే, జయసుధ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్నది తన అభిమతమని స్పష్టం చేశారు. 'మా' ప్రెసిడెంట్ గా జయసుధ అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలు జరపాల్సి వస్తే ఆ ఖర్చు 'మా'కు అదనపు భారం అవుతుందని పేర్కొన్నారు.