: చర్లపల్లి సెంట్రల్ జైలులో 80 లక్షల మందుల స్కాం


చర్లపల్లి జైలులో భారీ మెడికల్ స్కాం వెలుగుచూసింది. ఖైదీల పేరిట జైలు మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ 80 లక్షల రూపాయల మందులు కొనుగోలు చేసి మెడికల్ షాపులకు శఠగోపం పెట్టారు. చర్లపల్లి జైలు ఖైదీలకు మందులు సప్లై చేయాలి, మూడు నెలలకోసారి బిల్లులు చెల్లిస్తాం అంటూ కీసర నాగారంలోని అయ్యప్ప మెడికల్ హాల్ నుంచి 15 లక్షల రూపాయల విలువ చేసే మందులు కొనుగోలు చేశారు. ఏఎస్ రావు నగర్ లోని ఆరోగ్య ధన్వంతరి ఏజెన్సీ నుంచి 32 లక్షల రూపాయల మందులు, ముషీరాబాద్ లోని జీపీ మెడికల్ హాల్ నుంచి 10 లక్షల రూపాయల మందులు, ఇసీఐఎల్ లోని బంధన్ మెడికల్ హాల్ నుంచి 5 లక్షల రూపాయల మందులు, ఓ చిట్ ఫండ్ కంపెనీ నుంచి 3 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఇంకా కొన్ని షాపుల నుంచి కూడా లక్షల విలువ చేసే మందులు తీసుకున్నారు. ఇలా తీసుకున్న మందులను నగరంలోని వివిధ షాపులకు అమ్మినట్టు తెలుస్తోంది. తీసుకున్న మందుల బిల్లులు ఎంతకీ చెల్లించకపోవడంతో వీరంతా చర్లపల్లి జైలుకు వెళ్లి ఆరాతీశారు. దీంతో మోసం బయటపడింది. గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ కుంభకోణం జరిగింది. పై అధికారులు తమకు సంబంధం లేదని చెప్పడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దీనిపై జైళ్ల శాఖ డీజీకి అధికారులు నివేదిక పంపారు.

  • Loading...

More Telugu News