: భారీ సైనిక విన్యాసాలకు అమెరికా, దక్షిణ కొరియా సిద్ధం... యుద్ధభయంలో ఉత్తర కొరియా


అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్ధమవుతుండగా, వాటిని యుద్ధసన్నాహాలుగా ఉత్తర కొరియా భావిస్తోంది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య తీవ్ర విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అమెరికా, దక్షిణ కొరియా మధ్య సంయుక్త సైనిక విన్యాసాలకు ఇది కొనసాగింపని అధికారులు తెలిపారు. ఇవి భూమిపై జరగనున్న భారీ సైనిక విన్యాసాలని తెలిపిన దక్షిణ కొరియా, మార్చి 28 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయని వెల్లడించింది. సియోల్ కు దక్షిణాన ఉన్న పొహాంగ్ రేవు సమీపంలో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తామని దక్షిణ కొరియా తెలిపింది. ఈ సైనిక విన్యాసాలపట్ల ఉత్తర కొరియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి తమపై దండయాత్రకు సన్నాహకాలుగా పేర్కొంటోంది.

  • Loading...

More Telugu News