: రష్యాపై ఆంక్షలు కొనసాగుతాయి: అమెరికా, జర్మనీ


ఉక్రెయిన్ లో జోక్యం చేసుకుంటున్న రష్యాపై విధించిన ఆంక్షలను సడలించకూడదని అమెరికా, జర్మనీలు నిర్ణయించాయి. ప్రస్తుతమున్న ఆంక్షలన్నీ యథావిధిగా కొనసాగుతాయని తెలిపాయి. ఈ మేరకు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ ఫోన్ ద్వారా అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయుధాలను ఉపసంహరించుకోవడం, కాల్పుల విరమణ, రాజకీయ చర్చలు మాత్రమే ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించగలవని వీరిద్దరూ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ లో దాదాపు ఏడాది నుంచి సంక్షోభం నెలకొంది. ఈ కాలంలో దాదాపు 6 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News