: ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిందే: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిందేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ వైఖరి అని ఆరోపించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ తో రాష్ట్ర బీజేపీ నేతలతో కలసి సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీని కానీ, తనను కానీ విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని చెప్పారు. ఏపీ సమస్యలను పరిష్కరించడానికి రాజ్ నాథ్ సింగ్ చొరవ తీసుకుంటున్నారని వెల్లడించారు.