: అవకాశం ఇవ్వకపోతే స్పీకర్ ను అలా అనకుండా ఎలా ఉంటాం?: కొడాలి నాని
ఈనాటి అసెంబ్లీ సమావేశాల్లో 8 మంది వైకాపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అసెంబ్లీ ఆవరణలో వైకాపా నేత కొడాలి నాని మాట్లాడుతూ, స్పీకర్ ను తామేమైనా బూతులు తిట్టామా? అని ప్రశ్నించారు. తాము కేవలం డౌన్ డౌన్ అని మాత్రమే అన్నామని... తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే, స్పీకర్ ను అలా అనకుండా ఎలా ఉంటామని అన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమను బూతులు తిడుతున్నారని... అయినా వారిని నిలువరించకుండా స్పీకర్ వారికే మైక్ ఇస్తున్నారని కొడాలి మండిపడ్డారు. జగన్ అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకే, స్పీకర్ ను అడ్డుపెట్టుకుని సభను నడిపిస్తున్నారని ఆరోపించారు.