: భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ను అడ్డుకున్న వర్షం
ప్రపంచకప్ లో భాగంగా మెల్ బోర్న్ లో భారత్, బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ను వర్షం పలకరించింది. 38.1 ఓవర్లు పూర్తయిన సమయంలో జల్లులు పడ్డాయి. దీంతో ఆటకు అంతరాయం కలిగింది. పిచ్ పై వెంటనే కవర్లు కప్పారు. ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ 83 (96 బంతులు), రైనా 38 (38 బంతులు) క్రీజులో ఉన్నారు. ఆకాశంలో స్వల్పంగా మేఘాలు ఆవరించి ఉన్నాయి. అయితే, జల్లులు కురవడం కూడా వెంటనే ఆగిపోయింది. కవర్లు తొలగించాలని అంపైర్లు ఆదేశించారు. కాసేపట్లో ఆట ప్రారంభం కానుంది.