: ఉగ్రవాదులకు మద్దతివ్వడం ఆపండి: పాక్, ఐఎస్ఐలకు రాజ్ నాథ్ సూచన
ఉగ్రవాద సంస్థలకు పూర్తి స్థాయిలో మద్దతిస్తున్న పాక్ ప్రభుత్వం, ఐఎస్ఐలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు సహాయ, సహకారాలు అందజేయడాన్ని వెంటనే ఆపాలని సూచించారు. ప్రపంచంలో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదుల అని ఉండరని... వారంతా సంఘ విద్రోహ శక్తులే అని చెప్పారు. ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఆపితే, దక్షిణాసియాలో పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు. స్వప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని వాడుకోవడాన్ని పాక్ ఆపాలని సూచించారు.