: నిన్నటి సీన్ రిపీట్... వెల్ లో వైకాపా నినాదాలు... టీవీలో ప్రత్యక్ష ప్రసారం


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా సభ్యులు నినాదాలు చేస్తున్న దృశ్యాలను ప్రభుత్వం టీవీ చానల్స్ కు 'లైవ్' ఇస్తోంది. బడ్జెట్ పై జగన్ ప్రసంగిస్తున్న సమయంలో చర్చ ముగించాలని కోరుతూ స్పీకర్ కోడెల ఆయన మైకును కట్ చేయడంతో వివాదం మొదలయింది. తమ నేతకు మరింత సమయం కావాలని వైకాపా సభ్యులు పోడియంలోకి చొచ్చుకు వచ్చి నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున కేకలు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన కోడెల సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. కాగా, సభ్యుల నినాదాలు, పోడియం దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం అవుతుండడం రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదే మొదటిసారి.

  • Loading...

More Telugu News