: తెలంగాణ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టనున్న టీటీడీపీ?
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిపై టీటీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలన్న తమ డిమాండ్ అసలు పట్టించుకోకపోవడం, సీట్ల కేటాయింపుల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం తదితర అంశాలపై వీరు మండిపడుతున్నారు. తమను సభను నుంచి సస్పెండ్ చేసిన తర్వాత, క్షమాపణలు చెబుతామన్నప్పటికీ స్పీకర్ నుంచి ఎలాంటి ఉలుకు, పలుకు లేకపోవడం టీడీపీ నేతల ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. ఈ క్రమంలో, స్పీకర్ మధుసూదనాచారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీటీడీపీ భావిస్తోంది. ఇప్పటికే టీటీడీపీ నేతలు ఈ మేరకు నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.