: భగత్ సింగ్ నగర్ ను చుట్టుముట్టిన పోలీసులు... అర్ధరాత్రి నుంచి కార్డాన్ అండ్ సెర్చి సోదాలు
హైదరాబాదు, సరూర్ నగర్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో అర్ధరాత్రి అలజడి చోటుచేసుకుంది. వందలాది మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఏం జరుగుతుందో తెలియని ఆ కాలనీ వాసులు భయాందోళనలకు గురయ్యారు. పాత నేరస్తులున్నారన్న అనుమానంతో ఎల్బీ నగర్ డీసీపీ ఇక్బాల్ నేతృత్వంలో 300 మంది దాకా పోలీసులు భగత్ సింగ్ నగర్ ను చుట్టుముట్టారు. రాత్రి 3 గంటల సమయంలో ఒక్కసారిగా మోహరించిన పోలీసులు కార్డాన్ అండ్ సెర్చిలో బాగంగా అక్కడి ఇంటింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనుమానాస్పదంగా కనిపించిన 21 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని 50 బైక్ లు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.