: 35 పాత చట్టాలను తొలగిస్తూ లోక్ సభలో బిల్లు ఆమోదం


కేంద్ర ప్రభుత్వం ఉపయోగంలో లేని పాతచట్టాల ఏరివేతను ప్రారంభించింది. అందులో భాగంగా నిరుపయోగంగా ఉన్న 35 పాతచట్టాలను తొలగిస్తూ ఒక బిల్లును లోక్ సభ ఈ రోజు ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ మాట్లాడుతూ, ఒకటి రెండేళ్లలో పాతచట్టాలను పూర్తిగా తొలగిస్తామని అన్నారు. పాతచట్టాలను తొలగించే దిశగా ఇది మొదటి అడుగని ఆయన చెప్పారు. ఇకపై చట్టాలపుస్తకం తేలికైపోతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News